3842) కృపలేని క్షణమున నేను శూన్యమే


** TELUGU LYRICS **

కృపలేని క్షణము
 నేను శూన్యమే
కృప చూపిన తరుణమున నేను సైన్యమే (2)
జారినా నన్ను పైకి లేపి నీ అడుగులలో నన్ను నడిపించి
నన్ను భరించిన కృప నన్ను బలపరచిన కృప
నన్ను భరించిన కృప నన్ను బలపరచినది నీ కృప
 (2)
నీ కృప.. 
నీ కృప.. నీ కృప.. నీ కృప.. 

ఒంటరి బ్రతుకులో ఒడిదుడుకుల మధ్యలో నలిగిపోతిని నే అలసిపోతిని
 (2)
నేనున్నానని తొడునిలిచినావు నీ చెలిమితో నన్ను ఓదార్చినావు
 (2)
ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీ కృప
 (2)

ఆత్మను కోల్పోతిని అంధుడనే నైతిని దూరమైతిని నీ దివ్య సన్నిది
 (2)
మరల నిన్ను చేరగా కోపించక నను హత్తుకున్నావు ముద్దుపెట్టినావు (2)
ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీకృప
 (2)

శ్రమలలో నేనుండగా దూరమైన ఆత్మీయులే కానరారే నాకు స్నేహితులే
 (2)
అందరికి మించిన కృపనిచ్చినావు అందని శిఖరాలు ఎక్కించినావు
 (2)
ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీ కృప
 (2)

సేవలో అవమానమే బ్రతుకులో అవమానమే ప్రతి విషయమై నాకు అవమానమే (2)
అవమానాలను సన్మానాలుగా మార్చావు నీవే కన్న తండ్రిగా
 (2)
ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీ కృప
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------