3826) క్రిస్మస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే స్తుతి కీర్తన

   

** TELUGU LYRICS **

    క్రిస్మస్ అంటే ఆరాధన 
    క్రిస్మస్ అంటే స్తుతి కీర్తన
    క్రిస్మస్ అంటే స్తోత్రార్పణ
    రండి పండగ చేద్దామా
    ఊరూవాడ తేడాలేక - పల్లేపట్టణ బేధం లేక
    ఏకమనస్సుతో అందరు చేసే
    కన్నుల పండుగ ఆ....
    రక్తాన్నే చిందింప వచ్చెనుగా 
    రాజ్యాన్నేస్థాపింప వచ్చెనుగా
    శాపాన్నే తొలగించ పుట్టెనుగా
    దీనుడై పుట్టేగా ఆ.....
    అ.ప: రండి రారండి వచ్చి చూడండి 
    బెత్లహేములో పండగ చేద్దాం
    తరలి రారండి తరచి చూడండి
    బెత్లహేములో యేసు పుట్టెన్ 

1.  గొల్లలంత ఒకటై యుండ
    చలిమంట కాగుచుండ
    దూతవచ్చి చెప్పేనుగ రక్షకుడు పుట్టాడని  
    తూర్పు దేశపు జ్ఞానులంతా
    యూదుల రాజునే పూజింప
    చుక్కను చూసి వచ్చా రుగా
    ఆనంద భరితులై 
    గొల్లలే స్తోత్రాలర్పిoచంగా   
    జ్ఞానులే కానుక లర్పిoచంగా
    పరలోక సైన్యం సంతోషంతో
    గానాలు చేసేనుగా
    ఊరూవాడ తేడాలేక
    పల్లేపట్టణ బేధం లేక
    ఏకమనస్సుతో ఆరాధించే
    కన్నుల పండుగ ఆ..... 
    ||రండి రారండి||

2.  యేసులేని పండగలేలా
    ఆత్మ లేని ఆరాధన లేలా 
    ప్రేమలేని ఆర్భాటాల క్రీస్తు కోరలేదుగా
    కులవర్గాల బేధాలేలా 
    కలువాలేని కూటాలేలా 
    ప్రేమలో లోపాలేల  క్రీస్తు చెప్పలేదుగ 
    ఏక రాజ్యమై యేసుతో నుండ 
    ప్రేమలో పరిపుర్ణులై యుండ
    క్రీస్తులా లోకానికి  వెలుగై
    వెలిగే  నక్షత్రమై 
    హృదయమే సంతోషించేల 
    ఆనందం పొంగి పారేల 
    యేసు రాజుని ఆరాధింప
    కలసి పండగ చేద్దాం ఆ...... 
    ||రండి రారండి||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------