** TELUGU LYRICS **
యేసు రాజుని జననం లోకానికే ఇది సుదినం
ఆహ్లాదమౌ ఈ తరుణం పులకించెను నా హృదయం
సర్వజనులకు పర్వదినం నా యేసు నాదుని జననం ఓ ఓ ఓ..
ఆహ్లాదమౌ ఈ తరుణం పులకించెను నా హృదయం
సర్వజనులకు పర్వదినం నా యేసు నాదుని జననం ఓ ఓ ఓ..
||యేసు రాజుని||
1. పాపులబ్రోచె రక్షకుడంట పసి బాలునిగా వెలేసేనంటా
కాంతిని మించిన తేజోమయుడై పసుశాలలో పవళించేనంటా (2)
పరవశించి పాడెను దుతగణములెల్లరు
పరము మురిసి పోయేను ధరణి మెరిసి పోయెను
మదిని ఉల్లసించేనే రక్షకుడు ఏతెంచేనే...
||యేసు రాజుని||
2. మందను కాచే కాపరులంటా యేసుని చూడ వచ్చేనంటా
ముందుగా నడిచే తారను చూసి తూర్పుజ్ఞానులే వచ్చెనంటా (2)
చల్లనైన వేళలోన జాబిలమ్మ కాంతిలోన
పసులపాక నీడలోన తల్లి మరియ జోలపాడే
పరమసుతుడే బాలుడై ప్రేమగా ఏతెంచెనే..
||యేసు రాజుని||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------