3771) వచ్చావయ్య భువికెంతెచ్చావయ్య పాపాన్నే పారద్రోలవయ్య

** TELUGU LYRICS **

    వచ్చావయ్య భువికెంతెచ్చావయ్య 
    పాపాన్నే పారద్రోలవయ్య
    తెచ్చావయ్య వెలుగులు తెచ్చావయ్య 
    మానవాలికే రక్షణ నిచ్చావయ్య
    నిశిధి రాతిరిలో చలి చలి గాలులలో 
    సంతోషకరమైన సువార్తమానముతో  
    ||వచ్చావయ్య||

1.  సత్యమే శరీరధారిగా ఈ లోకమున జనియించెను 
    వెలుగే కన్నుల బాసటగా ఈ భువిపై ప్రసరించెను  (2)
    ఆ జీవమే జ్ఞానుల మార్గమై రక్షకుని దరిచేర్చెను
    శ్రేష్ఠమైన అర్పణలతో క్రీస్తును కొనియాడిరి
    ఆనందమే క్రీస్తు పుట్టెను ఈ లోకానికే సమాధానము
    యూదుల రాజా ఆరాధించెదమ్ పూజ్యనీయుడా పూజించెదమ్
    హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ వుయ్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్ (2)
    ||వచ్చావయ్య||

2.  విధేయతే నీతి చిగురుగా పశులతొట్టెలో పరుండెను 
    పసిబాలుడె ఇమ్మానుయేలుగా మనకొరకు ఉదయించెను (2)
    బేత్లేహేములో పశువులపాకలో పరలోకమహిమ దిగివచ్చెను
    సృష్టి అంతా పరవశముతో స్తోత్రములు చెల్లించ్చెను
    ఆనందమే క్రీస్తు పుట్టెను ఈ లోకానికే సమాధానము
    యూదుల రాజా ఆరాధించెదమ్ పూజ్యనీయుడా పూజించెదమ్
    హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ వుయ్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్ (2)
 
    ||వచ్చావయ్య||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------