3770) నా హృదయమే ఉప్పొంగేనే నీ రాకతో బ్రతుకు ధన్యమాయెనే

    

** TELUGU LYRICS **

    నా హృదయమే ఉప్పొంగేనే 
    నీ రాకతో బ్రతుకు ధన్యమాయెనే (2)
    ఊహకు అందదే నీ జననము
    మానవాళి రక్షణకై నీ త్యాగము
 (2)
    యేసయ్యా ఆ.. ఆ.. మనసారా స్తుతించెదన్ 
    బ్రతుకంతా ఆ.. ఆ.. నీ నామమే స్మరించెదన్
 (2)

1.  వేయినాళ్ళ నిరీక్షణ అదృశ్యమాయెను
    వేచి చుసినా రక్షణ ప్రత్యక్షమాయెను
 (2)
    పావనమే వరమాయె నీవే ఏతెంచగా
    కలవరమే మరుగయే నీవే అరుదెంచగా
    మా జీవితాలలో వెలుగును నింపిన దివ్య తేజుడా ఆ.. ఆ
 (2)

2.  లోకపాపము మోయ తండ్రి సన్నిధి వీడెను
    పవిత్రులునుగా చేయ సమీపస్థుడాయెను
 (2)
    కారణమే నీవాయే మా విమోచనకై
    మోక్షముకే ధారయే మము నడిపించుటకై
    మా పాపములన్నియు మోయగ వచ్చే కారణ జన్ముడా ఆ.. ఆ  
    ||నా||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments