3758) రారాజు జన్మించే ఆనందమే మహానందమే



** TELUGU LYRICS **

    రారాజు జన్మించే
    ఆనందమే మహానందమే
    రారాజు జన్మించే మనకోసమే యేసయ్య ఉదయించే నీకోసమే
    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం
    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం 
    ||రారాజు జన్మించే||

1.  లోకాన్ని ప్రేమించినా దేవుడు దీనునిగా ఇల దిగివచ్చెను
    ఆశ్చర్యమైన తన వెలుగులో నడిపించుటకు
    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం
    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం
 
    ||రారాజు జన్మించే||

2.  పాపములో ఉన్న తన ప్రజలను రక్షించుటకు ఇల దిగివచ్చెను
    శాశ్వతమైన తన రాజ్యములో నివసించుటకు
    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం
    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం
    ||రారాజు జన్మించే||

3.  ప్రేమామయుడైన మన దేవుడు మరియమ్మ గర్భాన జన్మించెను
    నిత్యమైన తన ప్రేమను పంచుటకు
    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం
    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం
    ||రారాజు జన్మించే||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------