3784) మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు మనిషికి ప్రాణాన్ని అర్పించిన నాధుడు


** TELUGU LYRICS **

మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు 
మనిషికి ప్రాణాన్ని అర్పించిన నాధుడు (2)
మనకోసమే నేడు జేన్మించెను చూడు (2)
హల్లెలూయ పాడు సంతోషమే నేడు 
||మనిషి ప్రాణంగా|| 

ప్రవచనాలన్నియు నెరవేర్చేనే నాడు 
ప్రపంచాన్ని రక్షింప జెన్మించె నేడు (2)
పశువులపాకలో పవళించెనే (2)
పరలోకమే ప్రస్తుతించెనే (2) 
మనకోసమే నేడు జేన్మించెను చూడు (2)
హల్లెలూయ పాడు సంతోషమే నేడు 

పాపులందరిని ప్రేమించినవాడు 
పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు (2)
పశువులపాకలో పవళించెనే (2)
పరలోకమే ప్రస్తుతించెనే (2) 
మనకోసమే నేడు జేన్మించెను చూడు (2)
హల్లెలూయ పాడు సంతోషమే నేడు 
||మనిషి ప్రాణంగా|| 

----------------------------------------------------------------------
CREDITS : Lyrics : Dr.Satish Kumar
Tune & Music : Bro.Sunil & Bro.Anup Rubens 
----------------------------------------------------------------------