** TELUGU LYRICS **
ఇది క్రిస్‌మస్ శుభదినము లోకానికి ఆనందము (2)
శాపము పోయెను విడుదల వచ్చెను దీవెనలే ఇచ్చెను (2)
ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం
ఇది రక్షణ కార్యం
1. దూత తెలిపెను శుభవార్త రక్షకుడేసు పుట్టెనని (2)
గొల్లలందరు జ్ఞానులందరు దూతలందరు ఆరాధించిరి
యేసును పూజించిరి
ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం
ఇది రక్షణ కార్యం
2. ఆకాశాన నక్షత్రం దారి చూపెను యేసుని చెంతకు (2)
రండి మనము యేసుని చేరి కానుకలిచ్చి ఆరాధించుదాం
సర్వోన్నతుని పూజించుదాం
ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం
ఇది రక్షణ కార్యం
Joy to the world the lord is come
Let earth receive her King
3. పాపులమైన మన కొరకై రక్షకుడేసు జనియించెను (2)
యేసే ప్రభువని అందరి దేవుడని మన హృదయాలలో విశ్వసించుదాం
లోకానికి చాటి చెప్పుదాం
ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం
ఇది రక్షణ కార్యం
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------