3712) రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం

    

** TELUGU LYRICS ** 

    రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం 
    రండి రారండోయ్ బెత్లహేముకు పోయొద్దాం (2)
    యేసయ్య పుట్టెను ప్రవచన పురుషునిగా 
    ప్రభువే వెలసెను దావీదు పురములో (2)
    రాజాధిరాజు ప్రభువుల ప్రభువే
    రండిరండి రారండి యేసయ్యను చూసొద్దాం 
    రండి రండి రారండి
    రాజాది రాజును పూజిద్దాం (2)
    రాజుల రాజు పసి బాలుడై
    పశువుల పాకలో పవళించినాడు
    పశువుల పాకలో పవళించినాడు
    ||రండి రారండోయ్||

1.  పరమందు దూతలు భూవి పైకి దిగివచ్చారు
    సర్వోన్నత స్థలములలో 
    దేవుని మహిమ పరిచారు 
    ఆ గొర్రెల కాపరులు దూతలను చూశారు 
    రక్షకుడు నేడు మన కొరకు పుట్టాడని 
    శిశువును చూచి ఎలుగెత్తి చాటారు 
    ||రండి రారండోయ్||

2.  చుక్కను చూచిన ఆ తూర్పు జ్ఞానులు 
    బెత్లహేము పురమునకు కానుకలు తెచ్చారు (2)
    ప్రభువును చూచి పూజించి వెళ్లారు 
    లోకానికి  రక్ష కుడు పుట్టాడని 
    పాప క్షమాపణ గొప్ప రక్షణ తెచ్చాడని 
    ||రండి రారండోయ్||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------