3711) హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం

    

** TELUGU LYRICS **

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం 
    అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం
    ఊరువాడ వీధుల్లోన తిరిగి చెప్పెదం
    యేసే మన దేవుడని ఆరాధించెదం

    పల్లవి: వార్త సంతోషవార్త శుభవార్త సర్వలోకనికీ
    వార్త రక్షణవార్త ప్రేమసువార్త ప్రజలందరికీ
    యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని
    చీకటి బ్రతుకులను వెలుగుగ చేస్తాడని
    ధైర్యమే మన వంతని చెప్పెను దూత
    హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ అంటూ ఆర్భటించెదం 
    అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం 
    ఊరూవాడా వీదుల్లోన తిరిగి చెప్పెదం
    యేసే మన దేవుడని ఆరాధించెదం (2)
    క్రిస్మస్ పాటలతో క్రీస్తు ప్రేమతో (2)
    ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాం

1.  మన పాపం మన శాపం తీసివేయను - యేసు ధరకు వచ్చెను
    మన రోగం మన మరణం తీసివేయను - యేసు ఇలకు వచ్చెను (2)
    పాపము తీయుటకు - శాపము బాపుటకు
    సిలువ రక్తముతో - మనలను కడుగుటకు 
    ఎంతో ఇష్టపడి వచ్చెను యేసు (2)  
    ||హ్యాపీ హ్యాపీ||

2.  ఇమ్మానుయేలను వాగ్ధానముతో 
    యేసు ధరకు వచ్చెను
    ఇల నుండి పరలోకం మనలచేర్చను యేసు ఇలకు వచ్చును (2)
    మన తోడైయుండ మనలను రక్షింప
    మనకై మరణించి సమాధి చేయబడి
    తిరిగి లేచుటకు వచ్చెను యేసు (2) 
    ||హ్యాపీ హ్యాపీ||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------