3747) పరమును విడిచిన మహనీయుడు కీర్తనీయుడా

    

** TELUGU LYRICS **

    పరమును విడిచిన 
    మహనీయుడు కీర్తనీయుడా
    ఆరాధనీయుడా...
    ఆరాధనా నీకేనయ్యా... ఆరాధనా నీకేనయ్యా...

1.  ఆది అంతములేని - నిత్యముండువాడవు
    మహామహిమలో - నివసించువాడవు (2)
    నీ త్యాగము మరువలేమయ్య
    మృత్యుంజయుడవైన యేసయ్య (2)

2.  మానవుల రూపంలో - దాసుని స్వరూపంలో
    అవతరించినావు - మానవులను రక్షించుటకు
    నీ ప్రేమను వర్ణించలేమయ్య
    నీ కృపను వివరించలేమయ్యా

3.  యే యోగ్యత లేని మా జీవితాలకు
    పరలోక భాగ్యము నిచ్చుట కోరకు
    నీ సింహాసనం విడిచినవే
    నీ ప్రాణము అర్పించినవే

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------