3746) ఆ.. రాజు మహారాజు రాజు యుదుల రాజు

    

** TELUGU LYRICS **

    ఆ...............
    రాజు మహారాజు - రాజు యుదుల రాజు (2)
    రాజు పుట్టాడని - మహా రాజు పుట్టాడనీ...
    వెలుగై వచ్చాడనీ - మార్గం చూపిస్తాడనీ (2)
    ఆశ్చర్యకరుడని - ఆలోచనకర్తయని - నిత్యుడుగు తండ్రియని 
    సమాధానకర్తయని - బలవంతుడైనా దేవుడని - ఆయనే అధిపతియని - చాటిచెప్పేదం.. హ్మ్ హ్మ్మ్.....
    భోలో-భోలో-భోలో మహారాజుకి జై
    ఈ లోక రక్షకుడైనా - యేసు రాజుకి జై (2)
    హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
    మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

1.  ఓ అక్కా.... ఓ తమ్ముడా.....
    ఓ అక్క..ఓ తమ్ముడా
    విన్నావా ఈ వార్తనూ .....(2)
    క్రీస్తుయేసూ మన అందరికోసం - రక్షకునిగా ఇల జన్మించాడనీ 
    ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడనీ - మరిఎన్నోవిజయాలు నీకు ఇస్తాడని
    వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2) 
    ||భోలో||

2.  ఓ తరమా....ప్రియజనమా... 
    ఓ తరమా.. ఓ ప్రియజనమా
    విన్నావా ఈ వార్తనూ... (2)
    సర్వమానవాళికి నిజదైవమూ-శ్రీ యేసయ్య ఒక్కడేననీ 
    మార్గం సత్యం జీవం తానై -అందరికీ నీరీక్షణ ఇచ్చాడనీ 
    వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా  నీ హృదయంలో చోటునూ (2)
    ||భోలో||

3.  ఓ అవ్వా.... ఓ తాతా.....
    ఓ అవ్వ..ఓ తాత విన్నావా ఈ వార్తనూ..... (2)
    మన పాపభారమంతా - సిలువలో మోసినాడనీ
    పాప క్రయధనము చెల్లించీ-నిత్యజీవమును ఇచ్చాడనీ
    వింటున్నావా ఈ శుభవార్తనూ... ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ..(2)
    ||భోలో||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------