3699) యెహోవా నీ దరి చేరుటకు మాకు యేసుక్రీస్తు నుంచినావు


** TELUGU LYRICS **

యెహోవా..యెహోవా..
యెహోవా హా....
యెహోవా నీ.. దరి చేరుటకు మాకు యేసుక్రీస్తు నుంచినావు (2)
మార్గముగా.. సత్యముగా.. జీవముగా..
మాకొరకు ముందుగ వెల్లి స్థలము సిద్దపరచుగా..(2)
||యెహోవా నీ||

పరలోకము.. మా వరము
పరిశుద్ధతే దానికాధారము (2)
రక్షణయేగా మాకున్న మార్గము(2)
విశ్వాసమేగ లోకముపై విజయము(2)
నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్నవాడవు
ఆదియు అంతము ఆల్ఫా ఒమేగా అయి ఉన్నావాడవు (2)
||యెహోవా నీ||

వేదనలు శోధనలు ఎన్ని వచ్చినా
దూతలకు మాకోరకై ఆజ్ఞనిచ్చినావు
వేదనలు శోధనలు ఎన్ని వచ్చినా
నీ దూతలకు మాకోరకై ఆజ్ఞనిచ్చినావు
పాదములకు రాయి తగులకుండా
నా పాదములకు రాయి తగులకుండా
అవియే మమ్ము కాపాడును
అవియే మమ్ము కాపాడును.
నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్నవాడవు
ఆదియు అంతము ఆల్ఫా ఒమేగా అయి ఉన్నావాడవు (2)
||యెహోవా నీ||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------