3680) జీవిత యాత్రలో నా జీవన యాత్రలో

    
    
** TELUGU LYRICS **

    జీవిత యాత్రలో నా జీవన యాత్రలో
    నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా (2)
    నా తోడుగా ......... నా నీడగా ....
    నన్ను నడిపించును నజరేయుడు గలలేయుడు  
    ||జీవిత యాత్రలో||

1.  నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను
    సుడిగాలిలో చిక్కుకున్న నా నావను
 (2)
    అలలపై నడచినాడు గాలి తుఫానునే అనచినాడు
 (2)
    చుక్కాని తానై దరి చేర్చినాడు నా నావను
    ||జీవిత యాత్రలో||

2.  గొఱ్ఱెవలె దారితప్పి తిరుగుచుండగ
    వెదకి వెదకి వెంబడించి నను పట్టుకుని
 (2)
    నాకై రక్తమిచ్చి నాకై ప్రాణమిచ్చి
 (2)
    నా త్రోవకు వెలుగు చూపి నడిపించినాడు నా యింటికి
    ||జీవిత యాత్రలో||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------