3660) చల్లని స్వరమే మెల్లగా పలికెను


** TELUGU LYRICS **

చల్లని స్వరమే మెల్లగా పలికెను
తన సన్నిధిలో జోలలు పాడెను (2)
లాలి లాలి యేసు ఒడిలో లాలి
దూతల స్తోత్రవళి నిదురలో నినుఁచాలి
 (2) 
||చల్లని స్వరమే|| 

మా నవ్వుల పంట! దేవుని వరమే నీవు
ప్రార్థన ఫలితంగా మా బ్రతుకులో పండావు
 (2)
నిదురలో కలల అలలపై తెలిపోతున్నావా
కను రెప్పలపై ఎగిరి ప్రభుతో ఆటలాడుతున్నావా 
(2) 
||లాలి లాలి||

ప్రభు పనిలోన పాత్రగా నువ్వు వెలగాలి
తన ప్రేమను చాటే సాక్ష్యములను పొందాలి
 (2)
అలసట కరుగులాగా ఆదమరచి నిదురపో
ప్రభు దయతో నువ్వెదిగి తనతో అలుపెరుగక సాగిపో
 (2)  
||లాలి లాలి||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments