2643) కన్నీరు తుడువబడెను కమనీయ ప్రేమలో

** TELUGU LYRICS **

    కన్నీరు తుడువబడెను కమనీయ ప్రేమలో  
    చింతలన్నీ తీర్చబడెను చెంత చేర్చు యేసునిలో 
    ఆశలన్నీ తీరెను ఆనంద యాత్రలో 
    వేదనంత తొలగెను విశ్వాస బాటలో 
    ||కన్నీరు||

1.  శ్రమయందు కృంగిన నన్ను లేవనెత్తే యేసు ప్రేమ 
    బంధకములలో నుండి విడిపించే దేవుని మాట 
    దీనులకు విందుగా మార్చెను నన్ను 
    తన విందుశాలకు తోడ్కొనిపోయెను 
    ||కన్నీరు||
 
2.  జీవాధాత అయినా క్రీస్తు నాలో జీవించే 
    కురిపించే నాపై దీవెన జల్లులు 
    ప్రకాశింప చేసెను వెలుగులేని చోట్లలో 
    జీవింపచేసెను విశ్వాస వీరునిగా
    ||కన్నీరు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------