3635) కలలోనైనా నే మరవగలనా కలువరి ప్రేమ అధి కనుమరుగవునా

** TELUGU LYRICS **    

    కలలోనైనా నే మరవగలనా
    కలువరి ప్రేమ అది కనుమరుగవునా
    కలలోనైన.. నే మరువగలనా .. 
    కలువరి ప్రేమ అధి కనుమరుగవునా
    నీ ప్రేమకు తూర్పు పడమర హద్దులు ఉండేనా 
    నీ  ప్రేమను పొందని జీవులు ఇలలో ఉండేనా 
    నీ ప్రేమకు పొగడే మాటలు దొరికేనా..
    నీ ప్రేమను సంద్రాలన్నీ ఒకటై అర్పేనా ఆర్పేనా 
    ||కలలోనైనా|| 

1.  ముల్లు గుచ్చి.... తలపైనా
    ఉమ్ము వేసి.... మోము పైనా
    నిన్ను బాధించి, హింసించి, సిలువపై శిక్షించినా
    చెక్కిలపై చెల్లుమన్నా
    నే సురూపం చెరిపిన 
    నీలో ప్రేమా ఈ పాపినే క్షమించమని అరచేనా 
    నీ ప్రేమకు తూర్పు పడమర హద్దులు ఉండేనా 
    నీ  ప్రేమను పొందని జీవులు ఇలలో ఉండేనా 
    నీ ప్రేమను పొగడే మాటలు వెదకినా దొరికేనా..
    నీ ప్రేమను సంద్రాలన్నీ ఒకటై అర్పేనా ఆర్పేనా
    ||కలలోనైనా|| 

2.  ప్రేమేలేని లోకంలోనా 
    గుబులే పుట్టే గుండెల్లోనా
    గమ్యం లేని జీవితానా 
    పలుకరించే నీ వింత ప్రేమా 
    ఎటు చూచినా నీ ప్రేమయే 
    ప్రవహించెనే నా కోసమే
    సెలయేరులా కాచుకుంది ప్రేమ నా కోసం 
    నా తప్పులన్ని మన్నించినది 
    తన సొత్తుగా నను మార్చినది 
    పడదా, పొగడదా, ప్రాణం కలకాలం
    ||కలలోనైనా|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------