2828) యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా

** TELUGU LYRICS **

    యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా - నన్ను
    భాసురముగ వేగవచ్చి కౌగలించవే
    అను పల్లవి: ఆశ నీవేగా నాదు ఆత్మనాథుడా - యేసువా

1.  ముండ్ల యందు నుండు వల్లి పద్మమువలె - నిచట
    మూర్ఖజనులు నన్నుకొట్టి గాయ పరచినన్
    ముద్దు ప్రియుడు యేసునాదు హర్షము

2.  ఇద్దరలో యేసు నాకు జల్దరువృక్ష - మిలలో
    సదమలుండు ఉత్తముండు పురుషులలోన
    ఎదలో క్రొత్తగాలి వలె ప్రేమవీచెను

3.  ప్రేమయను ధ్వజము నాకు పైగా నెత్తును - నన్ను
    ప్రేమతో రక్షింప నా యొద్ద నిల్చెను
    విమల స్వరము వినగా నాశతీరెను

4.  లేడిపిల్ల వలె నాదు ప్రియుడు యేసుడు - ఇదిగో
    కొండలపై ఎగసిదాటి వచ్చువేగమే
    కౌగిలించుకొనును నన్ను వేగమే

5.  వర్షఋతువు తీరిపోయెన్ వాన రాదిక - ఎంతో
    వింతగాను పుష్పములు పూసియున్నవి
    సంతసమున రాజ్యమేల జేర్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------