** TELUGU LYRICS **
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా
వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా
వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా
1. పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా
శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా
||యేసుని||
2. కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా
నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా
||యేసుని||
3. మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో
మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో
మనసా
||యేసుని||
4. ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా
వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా
||యేసుని||
5. వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా
కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా
||యేసుని||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------