** TELUGU LYRICS **
1. యేసునాథుని గాయములను చూడుము - నిత్యజీవము పొందెదవు
ప్రాణమిచ్చి విమోచించిన వానిని - నమ్మివచ్చి చేరి చూడుము
పల్లవి: చూచి జీవించు - యేసునాథుని గాయములను చూడుము
నిత్యజీవము పొందెదవు

2. పాపభారము మోసిన రక్షకునిచే - నీ నేరము తొలగెన్
జీవనాథుడు కార్చిన రక్తముచే - నీ పాప ఋణము తీరెన్
3. ఏ క్రియలు ప్రార్థన కన్నీళ్ళును - ఇన్ను రక్షింపజాలవు
రక్తంబే ఆశ్రయమని వచ్చిన - కరుణించు విమోచకుడు

4. పాప ప్రాయశ్చిత్త క్రియలు ముగిసె - అని ప్రభువే పల్కెను
సర్వలోకపు నేర పాపమున్ - సిలువలో నివృత్తి జేసెన్

5. పాపనాశకుడు ఇచ్చు రక్షణను - ఈ క్షణమే పట్టుకొనుము
నీ నీతియగు యేసు పుణ్యముచే - మోక్షానందముల పొందెదవు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :