2733) యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె

** TELUGU LYRICS **

    యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ
    యాజ్ఞల నభ్యసింపగ జేయరే 
    ||యేసు||

1.  పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము
    లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే
    ||యేసు||

2.  మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి
    బిడ్డల నాదరముతో బంపరే
    ||యేసు||

3.  యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ
    శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు
    ||యేసు||

4.  యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి
    హృదయము యేసురూపము దాల్చును
    ||యేసు||

5.  యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము
    వారి యెదలలో నాశతోడను నాటరే
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------