2734) యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు

** TELUGU LYRICS **

    యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు
    యుగయుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును

1.  అన్నిటికంటె ముందుగ నున్న - అల్ఫాగ తానై యుండి
    తనయందు మనల పూర్ణులజేసె - ఓమెగ తానైయుండి

2.  లోకము పుట్టక మునుపే తాను మహిమలో తండ్రితో నుండె
    ప్రేమను పొందిన తానే మనకై - శాశ్వత ప్రేమను జూపె

3.  అనేకులైన కుమారులను - మహిమకు తెచ్చుటకై
    రక్షణ కర్తను శ్రమల ద్వారా - సంపూర్ణుని జేసె తండ్రి

4.  జగదుత్పత్తి మొదలుకొని - వధియింప బడియున్న
    దేవుని గొర్రెపిల్లగ తానై - పరమందారాధన నొందు

5.  నిత్యము నిలచు తన నామంబు - నూతన సృష్టియందు
    తన సేవకుల సంతతి తనతో - తరతరముల వరకుండున్

6.  అధికంబైన కృప మహిమన్ - యుగయుగములయందు జూపన్
    మనలను లేపి కూర్చుండబెట్టె - క్రీస్తుతో మన తండ్రి

7.  ఇట్టి మహిమన్ పొందుటకై - మనమంత తనతో గూడ
    శిబిరము వెలుపట నిందల నోర్చి - వెళ్ళుద మాయనతో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------