2584) యేసు తృప్తి పరచితివి ఆశతో నీ చరణము చేర

** TELUGU LYRICS **

    యేసు తృప్తి పరచితివి - ఆశతో నీ చరణము చేర

1.  క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిమి
    నీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి

2.  నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివి
    సైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి

3.  నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితిని
    రక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే

4.  నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివి
    మది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద

5.  నిను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివే
    ధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------