2833) యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి

** TELUGU LYRICS **

    యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి

1.  గురుతులెల్ల లోకమంతా - సరిగజూడ కాననగున్
    పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభుకై కనిపెట్టుడి

2.  ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో - అర్ధరాత్రి యందేమో
    ఉదయంపు కోడికూతలప్పుడు - వచ్చునేమో కనిపెట్టుడి

3.  సిద్ధపడుడి మీరిలలో - మీరు దేవుని సంధింప
    సిద్ధపడుడి తీర్పునకై - ప్రభువుకై కనిపెట్టుడి

4.  పరిశుద్ధులై జీవించుడి - ప్రభుని చిత్తము చేయుడి
    మరణమేసు నందె సుమ్మా - మేలుకొని కనిపెట్టుడి

5.  యేసువలె జీవించుడి - తీసి వేయుడి మలినములన్
    మోసంపుటాశల నన్ని విడచి - ఆశతో కనిపెట్టుడి

6.  వేషధారణ విడచి - యేసు ముద్రల ధరించి
    పెండ్లి కుమారుని సంధింప - అందరు కనిపెట్టుడి

7.  మేఘములపై వెళ్ళిన ప్రభు - వేగముగ వచ్చునిల
    సకల శ్రమలను భరించి - హల్లెలూయ పాడుడి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------