2813) యేసు రాజున్ నీ యెదలో

** TELUGU LYRICS **

1.  యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా?
    నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా?
    పల్లవి: యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగా
    పాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము

2.  లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా?
    నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా?

3.  ఇంక తామసించినచో - వెనుక మోసమగును
    ఇపుడే రక్షణ దినము - వెనుక రక్షనబ్బదు

4.  పిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుము
    నీదు జీవబలముల - నేడే సమర్పింపుము

5.  రేపు యని తామసింప - నష్టము సల్గు సదా
    మంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు

6.  యోహాను మూడు పదహా-రును విశ్వసింపుము
    దప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే

7. హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురా
    త్రోసివేయడెన్నడును - మంచి యేసునాథుడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------