2629) యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును

** TELUGU LYRICS **

    యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును
    ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు

1.  మృతియే పాపపు జేవము - ప్రభుని వరము జీవము
    క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును
    ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడినిన్ కొనెగదా
    మరతువా యేసుని ప్రేమను - మరువకు

2.  కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నో
    గ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెను
    ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
    పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను

3.  మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్
    మరణ భయములో నున్న - వారిని విడిపించెను
    ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
    హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో

4.  సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని
    మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో
    ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
    సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే

5.  దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు
    పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
    ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
    పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము

6.  దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
    క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
    ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
    త్వరపడు నీదు భాగమును పొందను

7.  పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్
    ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేభూని
    దేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
    నీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------