2619) యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం

** TELUGU LYRICS **

    యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే
    మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం

1.  దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ
    జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం 

2.  పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ
    ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం

3.  పరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ
    మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం

4.  నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ
    హితుడా నీతిప్రబోధక నీవే శరణం

5.  తేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత
    రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------