2528) యేసయ్యా ఓ యేసయ్యా ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా


** TELUGU LYRICS **

యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా ఓ యేసయ్యా - ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా 
ఆశ్చర్య కార్యముల్ చేయువాడా - స్తుతియింతు మనసారా 
నీవే నాకు ఆధారము - నీవే నాకు ఆశ్రయము 
నీవే నా... జీవం - నీవే నా... సర్వం (2)  
||యేసయ్యా||

నీ నడకను నాకు నేర్పుమయా - నిను వెంబడించుటకు 
నీ మాటలు నాకు నేర్పుమయా - నిను నే చాటుటకు లం 
నీవే నా... జీవం - నీవే నా... సర్వం (2)  
||యేసయ్యా||

ప్రార్ధించుట నాకు నేర్పుమయా - అదియే నాకు బలం 
నీ చిత్తములో నడుపుమయా - అదియే బహు క్షేమం 
నీవే నా... జీవం - నీవే నా... సర్వం (2)  
||యేసయ్యా||

నీ ఆత్మతో నను నింపుమయా నీవలె నను మార్చు 
నీ మహిమను నాకు చూపుమయా - నిను నే ఘనపరతు 
స్తుతియూ... మహిమా... ఘనతా నీకే (2) 
||యేసయ్యా||

---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)
---------------------------------------------------------------------------