2660) యెహోవా ఇల్లు కట్టించని యెడల

** TELUGU LYRICS **

    యెహోవా ఇల్లు కట్టించని యెడల
    దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే
    యెహోవా పట్టణమును కాపాడనియెడల
    దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే

1.  మీరు వేకువనే లేచి రాత్రియైన
    తర్వాత పండు కొనుచు మీరు - తర్వాత
    ఆర్జితమైన ఆహారమును
    మీరు తినుచుండుట వ్యర్థమే - మీరు

2.  తన ప్రియులు నిద్రించుచుండగా
    తానే యిచ్చు చున్నాడు వారికి - తానే
    తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము
    కనెడి గర్భఫలము బహుమానమే - కనెడి

3.  యౌవన కాలమున పుట్టిన కుమారులు
    బలవంతుని చేతిలోని బాణములు - బలవంతుని
    తన అంబుల పొదిని నింపుకొనువాడు
    ధన్యుడు అట్టివాడు బహుగా ధన్యుడు

4.  యెహోవా యందు భయభక్తులు కలిగి
    నడచు వారందరు ధన్యులు - నడచు
    మహా మేలు నీకు కలుగును
    నిశ్చయముగా నీవు ధన్యుడవు

5.  నీవు ధన్యుడవు లోగిట నీ భార్య
    ఫలించు ద్రాక్షావల్లి వలె నుండు - ఫలించు
    భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు
    ఒలీవ మొక్కల వలె నుందురు

6.  యెహోవా యందు భయభక్తి గలవాడు
    ఆశీర్వదింపబడును నిజముగా - ఆశీర్వ
    యెహోవా నిన్ను సీయోను నుండి
    ఆశీర్వదించును బహుగా

7.  నీ జీవితమంతా యెరూషలేముకు
    క్షేమము కలుగుటయే జూతువు - క్షేమము
    నీ పిల్లల పిల్లలను చూతువు నీవు
    ఇశ్రాయేలు మీద నిత్యము సమాధానముండును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------