** TELUGU LYRICS **
యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు
ఇహమున అన్యజనము లెల్ల చెప్పుకొనుచున్నారటుల

1. యెహోవా మనకొరకు - గొప్ప కార్యములు చేసెను
మహా సంతోషభరితులమైతివిు - సహపనివారినిగా జేసెన్

2. ప్రారంభ కాలపనులను - పరిహసించువారెవరు
ప్రభు పనిచేయ పదివేలగు నొకడు - విరవిగ బలమౌ జనమగును

3. ప్రభు సువార్తకై బహుగా మేము - బాధించబడి యుంటిము
ప్రబలెను ప్రభుని వాక్యము - ప్రబలితిమి మేము ప్రభు కృపలో

4. పొరపాటులెన్నో చేసితిమి - ప్రభుకృపతో మమ్ము క్షమించెన్
విరోధ మంత్ర శకునము లేమి - ఇశ్రాయేలులో నికలేవు

5. భూమిపై గడ్డిని తడుపు - వానవలె విజయము నిచ్చెను
సమ భూమిని బోలి సముద్రములో - క్షేమముగా మము నడిపెను

6. అధికంబాయె మా అంత్యదశ - మొదటి పనులను మించెన్
మొదటి మందిర మహిమను మించె - తుది మందిరపు మహిమ

7. మహిమ ఘనతా ప్రభావములు - మా కృతజ్ఞతా స్తోత్రములు
సింహాసనాసీనుండా మాదు - సీయోను రాజా హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :