2505) యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా

** TELUGU LYRICS **  

    యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా
    యేసుని పిలుపు వినుమా ఆయన వాక్కును గైకొనుమా

1.  యొవనకాలమందే యేసు యొవన రుధిరం చిందించె
    సిల్వకెక్కి ప్రాణమిచ్చె ఆ ప్రేమను రుచి చూచినావా

2.  యొవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము
    వాక్యముతో సరిచూసుకో నీ నడతను సరిదిద్దుకో

3.  యొవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు
    జీవితం ప్రభుకీయుమా దీవన లెన్నో పొందుమా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------