3086) విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు

** TELUGU LYRICS **

    విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే
    తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల
    మొసగుఁ నది యేది 
    ||విసుకదే||

1.  మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు
    మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి
    ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు
    ||విసుకదే||

2.  ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం
    బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు
    మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు
    ||విసుకదే||

3.  ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు
    సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన
    చెప్పుటకు నుర్విలో లేఁడు
    ||విసుకదే||

4.  ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ
    నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి
    ధనమిచ్చినను కుంభినిని లేఁడు
    ||విసుకదే||

5.  ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు
    డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు
    సుఖ ప్రాప్తి యొనరించున్
    ||విసుకదే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------