3087) విసుగకుండా నిత్యము ప్రార్థించ వలెనని

** TELUGU LYRICS **

    విసుగకుండా నిత్యము - ప్రార్థించ వలెనని
    విశదముగా నుడివితివి - విసుగకుండా నిత్యము

1.  ఏకీభవించి భువిపైన యిద్దరు - వేడుకొను సంగతులను గూర్చి
    నా తండ్రివలన దొరుకునని - నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా

2.  ఆది అపొస్తలుల యేక భావముగా - ఎడతెగక నిను ప్రార్థించగా
    వారి మొఱ నాలించిన ప్రభువా - మా మొఱ నీ చెంతకు రానిమ్ము

3.  పేతురపొస్తలుడు చెరసాలలో నుండ - అత్యాసక్తిగా ప్రార్థించగా
    ఆనాటి శిష్యులు కనిరి - నీ గొప్ప మహాత్మ్యమును

4.  నా యందు మీరు మీలో నావాక్యము - నిలిచియుండిన యెడల మీకు
    ఏది ఇష్టమో దాని నడిగి - పొందుమంటివి క్రీస్తు ప్రభువా

5.  ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ - విసుగక కూడియుందురో
    అందరి మధ్యనుండే ప్రభువా - రమ్ము మా మధ్యకు నేడే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------