3084) విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం దేవునికే మేం వారసులం

** TELUGU LYRICS **

    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం
    వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ
    విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు
    జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో

1.  అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను
    అబ్రహామును దేవుని నమ్మెను - దేవుడతని కది నీతిగా ఎంచెను
    ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే - కదిలెనుగా అబ్రహాము
    యెహోవ యీరే అని కొడుకును లేపునని - అర్పించి పొందెనబ్రహాము
    విశ్వాసులకు తండ్రయ్యాడు - దేవునికే స్నేహితుడై పేరొందాడు
    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

2.  యోసేపుకు దేవుడు కల లిచ్చెను - ఫలించు కొమ్మగా అశీర్వదించెను
    యోసేపు దేవుని ప్రేమించెను - అన్ని వేళల ప్రభు వైపే చూచెను
    గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు
    ప్రభువే తోడుండా శోధన జయించి - అధిపతిగా ఎదిగినాడు
    బానిస కాస్త రాజైనాడు - ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు
    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

3.  దానియేలుకు దేవుడు వరమిచ్చెను - కలల భావము వివరింప నేర్పెను
    దానియేలు తన దేవుని ఎరిగెను - ప్రత్యేకముగా జీవించి చూపెను
    రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని - దేవుని మహిమను చూపాడు
    సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి - సింహాల నోళ్లను మూశాడు
    దానియేలు దేవుడే జీవము గల దేవుడని - రాజు చేత రాజ్యమంత చాటించాడు
    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

4.  సౌలును పౌలుగా దేవుడు మార్చెను - దైవ వాక్యపు ప్రత్యక్షత నిచ్చెను
    పౌలు యేసుని అంతట ప్రకటించెను - భులోకమంతా సంచారము చేసెను
    క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి - దర్శనమును నెరవేర్చాడు
    జీవ వాక్యమును చేత పట్టుకొని - సిలువ సాక్షిగ నిలిచాడు
    తన పరుగును కదా ముట్టించి - విశ్వాసం కాపాడుకొని గెలిచాడు

    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం
    వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ
    విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు
    జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 