3031) విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు

** TELUGU LYRICS **

    విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా
    నందము నొందు 
    ||విందు||

1.  సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా
    నిర్ణయించెను రండు
    ||విందు||

2.  నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె
    సత్యము రండు
    ||విందు||

3.  ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట
    నిజము దత్తము రండు
    ||విందు||

4.  పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును
    గూర్పఁబడినవి రండు
    ||విందు||

5.  నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర
    సర్వము మనవి రండు
    ||విందు||

6. దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను
    జేతురు వినను రండు
    ||విందు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------