3048) వినతి వినతి వినతి త్రియేకునికి

** TELUGU LYRICS **

    వినతి వినతి వినతి త్రియేకునికి
    అను పల్లవి: మనసునందు సద్గతి నిడును

1.  కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివి
    బాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన

2.  ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ము
    మేదినిసకలము మాయమైపోవును - సదయుడేసు నిలచున్

3.  కాయమస్థిరము కాలము నిల్వదు మాయక్షితి మాయమగున్
    దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము

4.  రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవు
    జీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు

5.  రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోట
    మింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే

6.  మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్
    జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా

7.  హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుము
    త్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------