3047) విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా


** TELUGU LYRICS **

విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా
అవిధేయత తొలగించుమయ్యా
నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2)       
||విధేయతకే||

పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2)
సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2)
అధికముగా హెచ్చింపబడితివి (2)        
||అవిధేయత||

పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)
శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)
రక్షణకు కారకుడవైతివి (2) 
||అవిధేయత||

** ENGLISH LYRICS **

Vidheyathake Ardhamu Cheppina Vinaya Manaskudaa
Vidheyulugaa Unda Maadiri Choopina Manuja Komarudaa
Avidheyatha Tholaginchumayyaa
Nee Deena Manassu Kaliginchumayyaa (2)       
||Vidheyathake||

Paricharya Cheyutake Dharaniki Vachchina Thyaagamoorthivi
Prathi Charya Jariginchaka Pagavaarini Kshamiyinchina Prema Deepthivi (2)
Siluva Maranamu Pondunanthagaa Neeve Thagginchukontivi (2)
Adhikamugaa Hechchimpabadithivi (2)       
||Avidheyatha||

Paripoornamaina Bhaya Bhakthulatho Thandriki Lobadithivi
Prathi Vishayamulo Pampina Vaani Chitthamu Neraverchithivi (2)
Shramalu Pondi Yaajakudani Devuniche Piluvabadithivi (2)
Rakshanaku Kaarakudavaithivi (2)   
||Avidheyatha||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------