3063) విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా

** TELUGU LYRICS **

    విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా నీదు
    విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా 
    ||విమల||

1.  అణఁకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ
    బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా
    ||విమల||

2.  నీ చిత్తమే యంచు నీ పాదములఁ బట్టి నిల్చియుందు నిండు
    నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా
    ||విమల||

3.  భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ
    జీవములయందు జయశాలినిగఁ జేయు మేసునాధా
    ||విమల||

4.  పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీఁద నన్ని
    తరుణములను నాకా దరణ మీవే యంచుఁ దలఁప నాధా
    ||విమల||

5.  నీ రూపము నిమ్ము నినుఁ బోలి నేనుండ నిత్యనాధా నీదు
    సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా
    ||విమల||

6.  ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో
    ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా
    ||విమల||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------