3092) వెండి బంగారము ఉన్నాలేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్నా

** TELUGU LYRICS **

    వెండి బంగారము ఉన్నాలేకున్నా
    నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్నా
    నీ సన్నిధి నాకు తోడుగ ఉంటే చాలును యేసన్నా 
    ||వెండి||

1.  ఎటు చూసినా వేదన – ఎటు చూసినా శొదనా (2)
    నీ పేటూ బీటలలో – నీ గాయపు చేతులలో 
(2)
    నీ అండ నాకు ఉంటే చాలు – దిగులే లేదన్నా 
(2) 
    ||వెండి||

2.  నా వారు ఎదిరించినా -నను చుట్టి భయపెట్టినా (2)
    నీ ఉన్నత నామంలో – నీ కల్వరి రక్తంలో 
(2)
    ఏ చీకటి శక్తుల గుంపుకైనా – చి౦తే లేదన్నా 
(2)
    ||వెండి||

3.  శ్రమయిన బాధైనాను – హింసైనా కరువైనను (2)
    నా శోధన వేళల్లో – నీ తోడు చాలన్నా 
(2)
    నీ తోడు నీడ జాడలలో – ఏ కొదువె లేదన్నా 
(2)
    ||వెండి||

4.  నా తల్లి నను మరచినా – నా వారు నను విడచినా (2)
    నాలో నీవున్నా – నీ దాపు నాకున్నా 
(2)
    ఏ దూరమైన భారమైన – భయమే లేదన్నా 
(2) 
    ||వెండి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------