3104) వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను

** TELUGU LYRICS **

    వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను
    తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు

1.  మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును
    మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా

2.  ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి
    తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము

3.  అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో
    సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే

4.  వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు
    సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము

5.  ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దాని యందు ప్రభు మహిమనిండి
    తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను

6.  సజీవ రాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు
    దేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------