** TELUGU LYRICS **
వెళ్ళెదము కూడి వెళ్ళెదము
శ్రేష్ఠ దేశమును చేరుటకు - నీతి నివసించును అందున

1. భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలె
ప్రవేశించ వలె విశ్రాంతిలో - తప్పిపోదుము మరచినచో

2. ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాస పడెదము మనమిలలో
పదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము

3. ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదము
దుష్టుని బారిని తప్పించుకో - దోచుకొన నివ్వకు మకుటము

4. సుళువుగా ఉరియొడ్డు - ప్రతి పాపమున్ - సంపూర్ణముగను తొలగించుచు
సహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్

5. సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగా
సహించిన కష్టదుఃఖములు - బహుగా ఫల మొందెదము

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :