3004) వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును

** TELUGU LYRICS **

    వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును
    చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను
    దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున 
    ||వచ్చును||

1.  అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె
    సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను
    ||వచ్చును||

2.  ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల
    బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము
    ||వచ్చును||

3.  అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక
    మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ
    ||వచ్చును||

4.  అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల
    దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ
    ||వచ్చును||

5.  తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి
    నొక్కరు నెల్లకాలము జూడని గడియ
    ||వచ్చును||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------