** TELUGU LYRICS **
స్వచ్చమైన తల్లి ప్రేమలా
కమ్మనైన తల్లి పాలలా
మధురం యేసు వాక్యము
ఎంత మధురం మధురాతి మధురం
యేసుని వాక్యం సర్వదా మధురం
నిన్న నేడు ఒక్కటే రీతిగా
నిరతము ఒకే మాటగా
మారని మార్పులేని యేసు మాట మధురం
స్వచ్చమైన తల్లి ప్రేమలా
కమ్మనైన తల్లి పాలలా
జుంటితేనె ధారలకన్నా మధురమైనది
సత్యమైన తండ్రి మాటలా
నమ్మదగిన చెలిమి తోడుగా
ప్రియమైన వారలకన్నా కోరదగినది
హృదయమును సంతోషపరచును
ప్రాణమును సంతృప్తిపరచును
జీవపు ప్రేమామృతమైన
యేసు మాట మధురం
పారుతున్న జీవధారలా
ప్రాణులకు ఆధారముగా
దప్పికగల వారలకెల్లా జీవమైనది
వెలుగుతున్న జీవజ్యోతిలా
వేదనలో ఆశాజ్యోతిగా
నిరాశగల వారలనెల్లా బలపరచునది
పాపములను ప్రత్యక్ష పరచును
ఫలమును ప్రత్యేక పరచును
పరమ జీవాహారమైనా
యేసు మాట మధురం
కమ్మనైన తల్లి పాలలా
మధురం యేసు వాక్యము
ఎంత మధురం మధురాతి మధురం
యేసుని వాక్యం సర్వదా మధురం
నిన్న నేడు ఒక్కటే రీతిగా
నిరతము ఒకే మాటగా
మారని మార్పులేని యేసు మాట మధురం
స్వచ్చమైన తల్లి ప్రేమలా
కమ్మనైన తల్లి పాలలా
జుంటితేనె ధారలకన్నా మధురమైనది
సత్యమైన తండ్రి మాటలా
నమ్మదగిన చెలిమి తోడుగా
ప్రియమైన వారలకన్నా కోరదగినది
హృదయమును సంతోషపరచును
ప్రాణమును సంతృప్తిపరచును
జీవపు ప్రేమామృతమైన
యేసు మాట మధురం
పారుతున్న జీవధారలా
ప్రాణులకు ఆధారముగా
దప్పికగల వారలకెల్లా జీవమైనది
వెలుగుతున్న జీవజ్యోతిలా
వేదనలో ఆశాజ్యోతిగా
నిరాశగల వారలనెల్లా బలపరచునది
పాపములను ప్రత్యక్ష పరచును
ఫలమును ప్రత్యేక పరచును
పరమ జీవాహారమైనా
యేసు మాట మధురం
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------