3381) స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో ఇంతవరకు కాచె దేవుడే

** TELUGU LYRICS **

    స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే

1.  ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చె
    చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము

2.  సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే
    వినిన వారిని ప్రత్యేకించే - చేరిపాడి స్తుతించెదము

3.  పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు
    సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము

4.  సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెను ప్రభువే
    సహపని వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము

5.  ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె
    స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము

6.  పరమ దర్శనము నిచ్చె - సరిగా లోబరచె మనల
    కరము నిచ్చె నడిపించె - చేరిపాడి స్తుతించెదము

7.  సంఘ మర్మనును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్త
    పార్చె పాపుల నెందరినో - చేరిపాడి స్తుతించెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------