** TELUGU LYRICS **
స్తుతి నీకే యేసు రాజా - మహిమ నీకే యేసు రాజా (2)
స్తోత్రం నీకే యేసు రాజా - ఘనత నీకే యేసు రాజా
హోసన్నా... హోసన్నా... హల్లెలూయా హోసన్నా... (2)
రాజులకు రాజు - ప్రభువులకు ప్రభువు - త్వరలోనే రానున్నాడు
నిత్య జీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు (యేసు) (2)
||హోసన్నా||
మధ్యాకాశములో - ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో - పాలు నొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము
||హోసన్నా||
సంతోష గానాలతో - ఉత్సహించి పాడెదము
క్రొత్త కీర్తనతో - రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైన శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము
||హోసన్నా||
పరిశుద్ధ హృదయముతో - పరవశించి పాడెదము
ఆత్మతో సత్యముతో - ఆరాధించెదము (మేము) (2)
యేసు ఒక్కడే దేవాధి దేవుడని (2)
ఎలుగెత్తి మేము చాటెదము
||హోసన్నా||
---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)
---------------------------------------------------------------------------