3436) స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ

** TELUGU LYRICS **

    స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
    స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ
    అను పల్లవి: గడచిన కాలమెల్ల - కంటిపాపవలె
    కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్

1.  పాపమును బాపినాడు హల్లెలూయ - మన
    శాపమును మాపినాడు హల్లెలూయ
    కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము
    యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్

2.  తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
    ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ
    ఎల్ల యీవుల నిచ్చి యులాస మొసగును
    కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్

3.  శోధన కాలములందు హల్లెలూయ - మన
    మేధన కాలములందు హల్లెలూయ
    నాథుడు యేసు మన చెంతనుండ నిల
    చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్

4.  ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు
    ఘోరముగ లేచినను హల్లెలూయ
    దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి
    ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్

5.  సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను
    సాక్షిగ నించెను యేసు హల్లెలూయ
    చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు
    చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------