3151) శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను

** TELUGU LYRICS **

    శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను - ఈ
    కష్టలోకమందు మనకు మిత్రు - డాయనే

1.  మాయక్షితిని రక్షింప వచ్చిన పరమ నాయకుడు - ఈ
    భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు

2.  ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ - ఆ
    గండుదొంగను సిలువలో వ్రేలాడి రక్షించెన్

3.  హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెను - ఆ
    పావనమగు రక్త ఊట ప్రవహించెన్

4.  మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను - తన
    తోడిశిష్యులు చూచుచుండ నారోహణమాయెన్

5.  జయము జయము అనుచు నీవు ప్రకటించుము - నీ
    జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమీయుము

6.  ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను - ఈ
    ధరణికి వేంచేయు కాలము సమీపించెను

7.  హల్లెలూయ పాడుచు నార్భాటముగ నాడు - ఆ
    వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------