** TELUGU LYRICS **
సర్వశక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే
1. పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైనను
లోకమైన యేమియైన - సర్వమును మీవే
లోకమైన యేమియైన - సర్వమును మీవే
2. జీవమైన మరణమైన - రాబోవునవైన
ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే
ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే
3. దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరే
అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే
అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే
4. దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలు
సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే
సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే
5. నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలె
పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే
పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే
6. జయమునొంది సర్వమును స్వతంత్రించుకొని
దేవుని కుమారిలగుట - దినదినము మీదే
దేవుని కుమారిలగుట - దినదినము మీదే
7. పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యము
క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే
క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------