3249) సర్వలోక సంపూజ్యా నమోనమో

** TELUGU LYRICS **

1.  సర్వలోక సంపూజ్యా నమోనమో సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో
    సర్వ సత్య సారాంశా నమోనమో దేవా గావో 

2.  దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో
    దేవా యేసావతార నమోనమో దేవా గావో 

3.  దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో
    పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో 

4.  వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో
    వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో 

5.  శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో
    ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------