3248) సర్వలోక నివాసులారా ఆనందించు డెల్లరు

** TELUGU LYRICS **

    సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు
    దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి

1.  ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడి
    ఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి

2.  నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివి
    నీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు

3.  సర్వలోకమును నీకు - నమస్కరించి పాడును
    నీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును

4.  చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్
    నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా

5.  సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెను
    జనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్

6.  ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడు
    అన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------